Sony Alpha ZV-E10M2K 26 MP Interchangeable Lens Mirrorless Vlog Camera for Creators
సుమారు ₹80,000 – ₹90,000 బడ్జెట్లో Canon R50, Nikon Z30 లాంటి కెమెరాలు దీనికి గట్టి పోటీ ఇస్తున్నాయి. కానీ, వాటితో పోలిస్తే కంటెంట్ క్రియేటర్స్ కి ఈ Sony Alpha ZV-E10M2K ఎందుకు బెస్ట్ ఛాయిస్ అనేది ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
లాభాలు (Pros)
-
సినిమాటిక్ 4K 60p & 10-Bit కలర్: Canon R50, Nikon Z30 లాంటి పోటీ కెమెరాల్లో కేవలం 4K 30p మాత్రమే ఉంటుంది. కానీ ఈ సోనీలో 4K 60p రికార్డింగ్ తో పాటు, హై-ఎండ్ కెమెరాల్లో ఉండే 10-bit 4:2:2 కలర్ సపోర్ట్ ఉంది. అంటే మీరు వీడియో తీశాక కంప్యూటర్లో మీకు నచ్చినట్లు సినిమాటిక్ కలర్స్ (Color grading) మార్చుకోవడానికి ఈ బడ్జెట్లో ఇదే బెస్ట్ కెమెరా.
-
ప్రపంచంలోనే అతిపెద్ద లెన్స్ ఎకోసిస్టమ్ (E-Mount): ఒక క్రియేటర్కి లెన్సులు చాలా ముఖ్యం. Canon, Nikon లలో వాళ్ల సొంత లెన్సులు మాత్రమే వాడాలి, వాటి రేట్లు చాలా ఎక్కువ, ఆప్షన్స్ కూడా తక్కువ. కానీ సోనీ కి Sigma, Tamron లాంటి వందలాది థర్డ్-పార్టీ లెన్సులు చాలా తక్కువ ధరకే మార్కెట్లో దొరుకుతాయి. భవిష్యత్తులో మీ ఛానెల్ పెరిగాక తక్కువ ఖర్చుతో అప్గ్రేడ్ అవ్వడానికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.
- రెట్టింపు బ్యాటరీ లైఫ్ (NP-FZ100): వ్లాగర్స్ కి అతిపెద్ద సమస్య బ్యాటరీ మధ్యలో అయిపోవడం. Canon R50, Nikon Z30, మరియు పాత సోనీ కెమెరాల్లో కూడా చిన్న బ్యాటరీలు ఇస్తారు. కానీ ఈ మోడల్ లో ప్రొఫెషనల్ కెమెరాలకు వాడే పెద్ద NP-FZ100 బ్యాటరీ ఇచ్చారు. కాబట్టి పదే పదే ఛార్జింగ్ పెట్టే పని లేకుండా గంటల తరబడి నాన్-స్టాప్ వీడియోలు రికార్డ్ చేసుకోవచ్చు.
- లక్షన్నర కెమెరాలో ఉండే సెన్సార్: ఏ బ్రాండ్ కూడా తమ హై-ఎండ్ కెమెరా సెన్సార్ను బడ్జెట్ కెమెరాలకు ఇవ్వదు. కానీ సోనీ తమ ఖరీదైన ప్రొఫెషనల్ సినిమా కెమెరా అయిన 'Sony FX30' (సుమారు లక్షన్నర) లో వాడిన అదే 26MP సెన్సార్ను ఇందులో అమర్చింది. అందుకే తక్కువ వెలుతురులో (Low light) కూడా వేరే కెమెరాల కంటే ఇది అద్భుతమైన క్లారిటీ ఇస్తుంది.
- క్రియేటర్స్ కి స్పెషల్ ఫీచర్స్: మనం వీడియో తీసుకుంటూ ముందుకి వస్తువులు చూపించినప్పుడు Canon కెమెరాలు ఫోకస్ అవ్వడానికి కొంత సమయం తీసుకుంటాయి. కానీ సోనీలో ఉండే 'Product Showcase' మోడ్ ద్వారా మీరు వస్తువు చూపించగానే రెప్పపాటులో దాని మీద ఫోకస్ అవుతుంది, తీసేయగానే వెంటనే మీ కళ్ల మీద ఫోకస్ పడుతుంది. సపోర్ట్ కి ఎవరూ లేకుండా ఒంటరిగా వీడియోలు తీసుకునే యూట్యూబర్లకి ఇదొక మ్యాజిక్ లాంటి ఫీచర్.
నష్టాలు (Cons)
- BIS లేదు (కెమెరా స్టెబిలైజేషన్): కెమెరాలో ఇన్బిల్ట్ స్టెబిలైజేషన్ లేదు. నడుస్తూ వీడియో తీస్తే కొద్దిగా ఊగుతుంది. దీనికి గింబాల్ వాడటం ఉత్తమం.
- వ్యూఫైండర్ (EVF) లేదు: ఎండలో ఫోటోలు తీసేటప్పుడు ఫోకస్ చూసుకోవడానికి కంటితో చూసే వ్యూఫైండర్ ఇందులో ఇవ్వలేదు. కేవలం స్క్రీన్ మీదే చూసుకోవాలి.
- మెకానికల్ షట్టర్ లేదు: ఇది కేవలం వీడియోలు తీసుకునే క్రియేటర్స్ కి మాత్రమే సూపర్. ప్రొఫెషనల్ గా బర్డ్స్, స్పోర్ట్స్ లాంటి ఫాస్ట్ ఫోటోగ్రఫీ చేసేవాళ్లకి ఇది అంతగా సరిపోదు
